`పిఎంటిఎ టిఎస్` క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైద‌రాబాద్‌: ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ ఆస్సోసియేషన్ (పిఎంటిఎ) 2021 సంవత్సరం నూతన క్యాలెండర్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో  ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధనరెడ్డి, కూర రఘోత్థం రెడ్డి, పిఆర్‌టియు అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, పిఎంటిఎ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీశ్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న పలుసమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రికి విన్నవించారు. అన్ని డిపార్ట్మెంట్ లతో పాటు మోడల్ స్కూల్ టీచర్స్ ప్రమోషన్లు, బదిలీలు కూడా చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం లో దశల వారి నియామకాలను చేపట్టడం వలన ఉపాధ్యాయులకు కలిగే నష్టాన్ని నోషనల్ సర్వీస్ కల్పించడం ద్వారా ఉపాద్యాయుల కు న్యాయము చేయాలని కోరారు. హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. వీరి విజ్ఞ‌ప్తి మేర‌కు మంత్రి స్పందిస్తూ త్వరలో ప్రమోషన్లు, బదిలీలు చేపడతామని.. ఈ మేర‌కు అన్ని సమస్యలు ముఖ్య మంత్రితో చర్చించి పరిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

అలాగే మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డిని, జాయింట్ డైరెక్టర్ రాజీవ్, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవీణ్ లు కూడా నూత‌న సంవ‌త్స‌ర‌ క్యాలెండర్ ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మోడల్ స్కూల్ టీచర్స్ ప్రమోషన్లు బదిలీలు కూడా త్వర‌గా చేయాల‌ని, నోషనల్ సర్వీస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పిఎంటిఎ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీశ్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య కోరారు. ఈ  కార్య‌క్ర‌మంలో కమిటీ సభ్యులు లావ‌ణ్య‌రెడ్డి, సయ్యద్ సాలెం, తిరుపతి గౌడ్, నాగేశ్వర్ రావు, పల్లె లింగా స్వామి, బాబ్లా నాయక్, అప్పల అశోక్, జయప్రకాష్, విట్టల్, విజయ్ అక్కెనపల్లి శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.