పీఆర్సీ పై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం
సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మార్త రమేష్
హైదరాబాద్ (CLiC2NEWS: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది మరియు పెన్షనర్లందరు కలిపి 9,21,037 మందికి 30% ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇస్తామని అసెంబ్లీ లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కరోనా ప్రభావం తో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా పెరిగిన జీతాలు ఉద్యోగులకు అందించే విధంగా ఆదేశాలు జారీ చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మార్త రమేష్ అన్నారు.
అదేవిధంగా పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని, నోషనల్ బెనిఫిట్ ను జులై 2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను ఎప్రిల్ 2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను ఎప్రిల్ 2021 నుంచి అమలు చేయాలని హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలని ఆయా ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగులు ఉపాద్యాయులు ఎంతో ఆనందంగా ఉన్నారు అన్నారు. పెన్షనర్లకు ఎప్రిల్ 2020 నుంచి మే 2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ ను 36 వాయిదాల్లో చెల్లిస్తున్నందుకు పెన్షనర్లు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు.
కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతోంది అన్నారు. ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని, రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎం.డీ హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నందున ఆయా విభాగాల్లో వైద్యులు మరియు ఉద్యోగులకు పని భారం తగ్గి మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంది ఆని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పట్ల తీసుకునే ప్రతి నిర్ణయం వారికి ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తోంది అని, మనది ముమ్మాటికీ ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఉద్యోగులందరూ అహర్నిశలు కష్టపడుతూ ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తారని తెలియజేశారు.