పురందేశ్వరీ, డికె అరుణలకు బాధ్యతల అప్పగింత
తెలంగాణ బిజెపి ఇన్‌చార్జిగా తరుణ్ చుగా

ఢిల్లీ: ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమితులైన వారికి బిజెపి బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వారికి బాధ్యతలు కేటాయించారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను అధిష్టానం మార్చింది. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చౌగను నియమించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా మురళీధరన్ నియమించగా.. సహ ఇన్‌చార్జ్‌గా సునీల్ దేవధర్‌ను కొనసాగించింది. ఇక ఏపీకి చెందిన పురందేశ్వరిని రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌గా హైకమాండ్ నియమించింది. ఛత్తీస్‌గడ్, ఒడిశా ఇన్‌చార్జ్‌గా పురందేశ్వరిని నియమించింది. ఉత్తరప్రదేశ్ సహ ఇన్‌చార్జ్, అండమాన్ నికోబార్ ఇన్‌చార్జ్‌గా సత్యకుమార్‌ను నియమించింది. కర్నాటక సహ ఇన్‌చార్జ్‌గా డీకే.అరుణకు బాధ్యతలు అప్పగించింది. మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా మురళీధరరావును నియమించింది. ఇక తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.