పులి కోసం అన్వేషణ.. సిసి కెమెరాల ఏర్పాటు

ఆసిఫాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అలడజడి రేపిన పులి.. పరిసర ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పులి కోసం గాలింపు కొనసాగుతోంది. తమపై దాడి చేస్తుందేమోనని స్థానికులు బిక్కు బిక్కు మంటున్నారు. దహె గాం మండలంలోని దిగడ అటవీ ప్రాంతంలో విఘ్నేశ్‌పై దాడిచేసి చంపిన పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్‌ స్కా డ్‌ బృందాలతో పాటు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చే శారు. ఒక్కో బృందంలో నలుగురు సభ్యులను నియమించారు. పులి సంచరించే ప్రాంతాల్లో 25 సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేస్తున్నారు. దాడి జరిగిన దహేగ మండలం, దిగిడ గ్రామంతోపాటు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో 10. కి.మీ. మీర సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పది బోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే పలుచోట్ల నాలుగు బోన్లు ఏర్పాటు చేశారు. మిగతావి వారంలోగా ఏర్పాటు చేయనున్నారు. బోన్లలో లేగదూడలను ఎరగా పెట్టి పులిని పట్టుకోవాలని చూస్తున్నారు. శుక్రవారం ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ వినోద్‌కు మార్‌ దిగడ ప్రాంతంలో గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.