పుస్తకాలు లేని విద్య

న్యూఢిల్లీ : ‘మ‌నిషిని మ‌హోన్న‌తునిగా తీర్చిదిద్దేది విద్య ఒక్క‌టే’ అని జ్యోతిరావు పూలే అన్నారు. ఈ క‌రోనా మ‌హ‌మ్మారితో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అందులో విద్యావ్య‌వ‌స్థ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. పిల్ల‌లంతా పుస్త‌కాలు వ‌ద‌లి మొబైల్స్‌, లాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్ల పై విద్యా కొన‌సాగిస్తున్నారు. కొన్ని పాఠ‌శాల‌లు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు విద్యాసంస్థలు సిద్ధమయ్యాయి. ఇక అందరికీ విద్య చేరిందా అనే అంశంపై నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి) చేపట్టిన సర్వేలో పలు అంశాలు వెలుగుచూశాయి. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేందుకు సుమారు 27 శాతం మంది విద్యార్థుల వద్ద స్మార్ట్‌పోన్స్‌ లేదా లాప్‌టాప్‌లు లేవని తేలింది. సరైన విద్యుత్‌ సదుపాయం లేకపోవడం వల్ల క్లాసులకు హాజరుకాలేకపోతున్నారని మరో 28 శాతం మంది విద్యార్థులు చెబుతున్నారు.
మొత్తం 34 వేల మందిని ఎన్‌సిఇఆర్‌టి సర్వే చేసింది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సిబిఎస్‌సి అనుబంధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సర్వేలో పాల్గన్నారు.

విద్యార్థులు ఎంత వరకు నేర్చుకుంటున్నారో తెలుసుకునేందుకు వారి తల్లిద్రండులకు ఉపాధ్యాయులు ఫోన్‌ చేసి తెలుసుకుంటున్నారు. సగానికి పైగా విద్యార్థులు పుస్తకాలు లేవని చెబుతున్నారు. ఎన్‌సిఇఆర్‌టి, దీక్ష వంటి వెబ్‌సైట్లలో ఈ టెస్ట్‌ బుక్స్‌ దొరుకుతాయని తెలిసినప్పటికీ… వాటి గురించి సరైన అవగాహన లేదని సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌లో లెక్కలు అభ్యసించడం చాలా కష్టంగా ఉందని అత్యధిక మంది తెలిపారు. ఏమి చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్న త‌ల్లిదండ్రులు.

Leave A Reply

Your email address will not be published.