పెద్ద‌పెల్లిలో రైతు వేదిక భవనాలను ప్రారంభించిన మంత్రి నిరంజ‌న్‌రెడ్డి 

రామగుండం: పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ ,పాలకుర్తి మండలంలోని పుట్నూరు గ్రామంలో రైతు వేదిక భవనాలను  ఇవాళ  వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి పూట్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పుట్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.