పెన్నా న‌దిలో ఏడుగురు యువ‌కులు గ‌ల్లంతు

క‌డ‌ప‌: స‌ర‌దాగా స్నానం చేయ‌డానికి పెన్నా న‌దిలో దిగి ఏడుగురు యువ‌కులు గ‌ల్లంత‌య్యారు. క‌డ‌ప జిల్లా సిద్ధవటం లోనీ పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు.. ప్రమాదవశాత్తు పెన్నా నదిలోపడి దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో యువకుల మృతదేహాల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

తిరుపతికి చెందిన 8 మంది యువకులు.. సిద్ధవటంలోని జరిగిన ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకులను తిరుపతికి చెందిన ఇరుపూరి శంకర (20), రాజేష్ (19), జగదీష్ (20),యాష్ (22),సతీష్ (20),నాని (20), తరుణ్ (20)లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు ఇద్దరి యువకుల మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.