పెళ్లి బస్సు బోల్తా పడి ఆరుగురు మృతి

కాసర్‌గఢ్: కేరళలోని కాసర్‌గఢ్‌లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు పాంతలూర్ రోడ్డులో అదుపు తప్పి ఎత్తైన ప్రాంతం నుండి ఓ ఇంటి పై కప్పుపై బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు..ఇద్దరు మహిళలు, ఇద్దరు మృతులు ఉన్నారు. మృతదేహాలను పూదమకల్లు తాలూకా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని మంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. బస్సులో 70 మంది ఉన్నట్లు తెలుస్తోంది.