పేదోడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక `డ‌బుల్ బెడ్రూం ఇళ్లు`: మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వ‌న‌స్థ‌లిపురం రైతు బ‌జారు స‌మీపంలో రూ. 28 కోట్ల వ్య‌యంతో నిర్మించిన 324 రెండు ప‌డ‌క‌గ‌దుల ఇళ్ల‌ను బుధ‌వారం ఉద‌యం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో కెటిఆర్ మాట్లాడుతూ..

పేదోడు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ఉద్దేశమ‌ని స్ప‌ష్టం చేశారు. అందుక‌నుగుణంగా పేదోడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఉండే విధంగా ఈ ఇండ్ల‌ను నిర్మించి ఇస్తున్నాం. ఇలాంటి ఇండ్లు భార‌త‌దేశంలోని ఏ రాష్ర్టంలో ఏ ప్ర‌భుత్వం కూడా నిర్మించ‌లేదు. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల్లో ఇలాంటి ఇండ్లు నిర్మించ‌లేదు. రెండు ప‌డ‌క‌గ‌దులు, ఒక హాల్, కిచెన్‌తో పాటు రెండు బాత్రూమ్‌లను నిర్మించాం. ఒక్కో ఇంటికి రూ. 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు పెట్టి నిర్మించామ‌ని తెలిపారు. దాదాపు రూ. 50 ల‌క్ష‌ల విలువ చేసే ఫ్లాట్‌ను పేద‌ల‌కు సీఎం కేసీఆర్ ఇస్తున్నార‌ని తెలిపారు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇండ్లు నిర్మిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌ది అని స్ప‌ష్టం చేశారు.
చెత్త‌ను తీసుకువ‌చ్చి ఇండ్ల మ‌ధ్య‌లో పారేయొద్దు. కొత్త రోగాలు, జ‌బ్బులు రాకుండా ఉండాల‌న్న‌, పిల్ల‌ల ఆరోగ్యం మంచిగా ఉండాల‌న్న పరిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకుని ఈ గృహ స‌ముదాయాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.

ఈ కార్యక్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌ల్లేశం, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.