పొలం చదును చేస్తుండగా దొరికిన గుప్తనిధి?
కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్‌లో రైతుకు గుప్తనిధి దొరికిందన్న వార్త స్థానిక ప్రజలంతా చర్చించుకుంటున్నారు. స్థానికంగా రంగనాయకుల గుట్ట వద్ద భూమి చదును చేస్తున్న ఒక రైతుకు పురాతన కుండ లభించిందన్న వార్త అందరూ అనుకుంటున్నారు. కాగా దొరికిన కుండలో గుప్తనిధి ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ నిర్వహించేందుకు గ్రామానికి చేరుకుంటున్నారు. రైతు నుంచి పూర్తి వివరాలు సేకరించిన తరువాత అన్ని విషయాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కాగా స్థానికంగా ఈ గుప్తనిధి దొరికిందన్న వార్త సంచలనం అయింది.