పోచారం ప్రాజెక్టు నీటిని వదిలిన ఎంపి బిబి పటేల్
నాగిరెడ్డిపేట్: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. భారీ, మధ్య తరహా, ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు అన్ని నీటితో కలకళలాడుతున్నాయి. నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు వరప్రదాయిని అయినా పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటితో నిండు కుండల నిండడంతో ఆయకట్టు కింద భూములకు పంటసాగు నిమిత్తం కోసం పూజ చేసి పోచారం ప్రధాన కాలువ గుండా,జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ.బీబీ పటేల్ నీటిని శుక్రవారం విడుదల చేశారు.అంతకుముందు ప్రాజెక్టు పరిసరాలను,గోల్ బండ్లను పరిశీలించడం జరిగింది.పోచారం ప్రాజెక్టు నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టును పర్యటక కేంద్రంగా మార్చాలని, ప్రాజెక్టు ఎత్తు పెంచాలని పలువురు మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయన్ను కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మనోహర్రెడ్డి, ఎంపీపీ రాజు దాస్,ఎల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గ్రామ సర్పంచ్ విజిత వాసురెడ్డి,ఎల్లారెడ్డి నీటిపారుదలశాఖ డిఈ వెంకటేశ్వర్లు, మండల నీటిపారుదల శాఖ అధికారి నాగరాణి, మరియు టిఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్, దుర్గారెడ్డి, సంజీవులు, రాజిరెడ్డి, నరసింహులసెట్, మోతి శ్రీనివాస్,వంశీ కృష్ణ గౌడ్,శ్రీధర్ గౌడ్, నరసింహారెడ్డి,మల్లారెడ్డి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.