పోలవరం పనుల పరిశీలనలో సిఎం జగన్

పోలవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్ లో సోమవారం చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణ పనులను సిఎం పరిశీలించారు. పోలవరానికి చేరుకున్న సిఎం కు మంత్రులు ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఈరోజు ఉదయం 11.50 నుంచి 1.15 వరకు అక్కడి పనుల పురోగతిపై సమీక్షిస్తారు.
మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సిఎం చేరుకోనున్నారు. ఈ పోలవరం పరిశీలన లో సిఎం జగన్‌తోపాటు మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపి మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోష్, కలెక్టర్లు రేవు ముత్యాల రాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాకవరప్రసాద్, పుప్పాలవాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు, జిల్లా ఎస్పి నారాయణ నాయక్‌లు పాల్గొననున్నారు.