పోలీసు ఉద్యోగాల‌ శిక్షణకు TSBCESDTC యాప్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో పోలీసు శాఖ‌లో భారీగా ఉద్యోగాలు రానున్న విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో నిరుద్యోగుల‌కు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ శుభ‌వార్త తెలిపింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆన్‌లైన్‌ శిక్షణ తరగతుల కోసం తెలంగాణ‌ బీసీ స్టడీ సర్కిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్ష 2021 కోసం ఉచిత కోచింగ్‌ నిమిత్తం తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి టీఎస్‌బీసీఇఎస్‌డీటీసీ(TSBCESDTC) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుండి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in కు లాగిన్‌ అవ్వొచ్చు లేదా 24071178, 6302427521 నెంబర్లకు కాల్ చేసి సంప్ర‌దించ‌వ‌చ్చు.

Leave A Reply

Your email address will not be published.