పోసాని సంచలన వ్యాఖ్యలు.. కెసిఆర్‌పై ప్రశంసలు

హైద‌రాబాద్‌: ఆంధ్ర పాలకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ దర్శకనిర్మాత, రచయిత న‌టుడు పోసాని కృష్ణమురళి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన. టీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో గత ఆంధ్ర పాలకులపై మండిపడుతూ. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఒకప్పుడు తెలంగాణ అంటే నీళ్లు లేని రాష్ట్రం, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్నారు. విమానంలో వెళ్తు పై నుంచి చూస్తే కింద అంతా పచ్చదమనే కనిపిస్తుందన్నారు. ఇక, కేసీఆర్‌కి ఆంధ్రావాళ్లంటే పడదు అనేవాళ్లు కానీ, కొందరు ఆంధ్ర నాయకులపైనే కేసీఆర్‌ కోపం అన్నారు. నీళ్లు, నిధులు అడుక్కోవాల్సి వస్తుంది. మన రాష్ట్రం మనకంటే బెటర్ అనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఆంధ్రావాళ్లను తరిమికొట్టాలి అనే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు. ఆంధ్రావాళ్లను ఓటర్లుగా చూడకుండా తెలంగాణవారితో సమానంగా చూశారని పోసాని అన్నారు. ఇక, ఎప్పుడైతే ఆంధ్ర పాలకులు తెలంగాణను విడిచివెళ్లిపోయారో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ధగధగ మెరిసిపోతుందన్నారు. దానికి కారణం సీఎం కేసీఆరేనని తెలిపారు. ఒకప్పుడు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు కానీ, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారని ఆయ‌న ప్రశంసించారు. ఎప్పుడైతే నాయకుడు నీతిమంతుడు అవుతాడో, నిబద్ధత ఉంటుందో, ఆ రాష్ట్రం సుఖసంతోషాలతో వెల్లివిరుస్తుందన్నారు. హైదరాబాద్ ని సముద్రం ముంచేసిందా అన్నట్టు వరదలు వచ్చాయి. 100 ఏళ్ల క్రితం ఇలాంటి వరదలే వచ్చాయట కానీ, హైదరాబాద్ ని వరద ముంచెత్తుతుందని ఎవరూ ఊహించరని. నిజాం నవాబు నిర్మించిన డ్రైనేజ్ సిస్టం ఇప్పటికీ ఉండబట్టే వరదలు ఆ స్థాయిలో ముంచెత్తాయన్నారు.. ఆ నాళాలను కూడా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఆక్రమించి నిర్మాణాలు చేయ‌డంతోనే హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయని పోసాని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.