ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్య‌మంత్రి

హైదరాబాద్: 72వ గణతంత్ర వేడుకలు ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌ రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.