ప్రజలతో నిత్యం మమేకమైన శాఖ పోస్టల్ శాఖ..

రాజమండ్రి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు..

రాజమండ్రి: భారతదేశంలో ప్రజలతో నిత్యం సత్సంబంధాలు పెట్టుకుని వారి దైనందిక జీవితంలో ముఖ్య పాత్ర వహించేది తపాలాశాఖ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో తపాలా శాఖ ఉద్యోగులు కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేసిన ఈ తపాలా శాఖ కు దాదాపు 175 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉందని అతి పురాతనమైన శాఖ తపాలాశాఖ అని ఆయన అన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ నిత్యం పలుకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, వారికి సమాచారాన్ని అందిస్తూ ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యంగా తపాలా జీవిత బీమా పథకాలు, సేవింగ్స్ డిపాజిట్లు మరింతగా పెంచడానికి సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు. కార్తీకమాసం సందర్భంగా అందరికీ వారధి తపాలాశాఖ అనే నానుడి తో హిందూ సాంప్రదాయాలు దేవాలయాల పేరుతో ప్రత్యేక పోస్ట్ కార్డులను ముద్రించడం జరిగింది అన్నారు. ముఖ్యంగా పంచారామాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో తాము ప్రత్యేకంగా పోస్ట్ కార్డులను రూపొందించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది అన్నారు. మన దేశంలో ఉన్న ఫిలాటిలిస్ట్ లకు ఈ పంచారామ పోస్ట్కార్డులు ముఖ్యమైన సంపదని ఆయన వివరించారు. ఫిలాటిలి అనేది స్టాంపుల సేకరణ ఇది ఒక విధమైన హాబీ అని ఆయన అన్నారు. ఈ ప్రపంచంలో ఫిలాటిలిస్ట్ లు లక్షలాది మంది ఉన్నారని ఆయన వివరించారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, దేశ నాయకులు, స్వతంత్ర ఉద్యమకారుల గురించి నిరంతరం స్మరించే విధంగా తపాలాశాఖ స్టాంపులు విడుదల చేస్తోందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు ప్రాంతాల్లో పోస్టల్ కవర్లు విడుదల చేశామన్నారు. ఈ విధమైన చారిత్రాత్మక ఘట్టాలను డాక్యుమెంట్ చేయడం అనేది ఒక ఒక సాధనం అన్నారు. సిరిమానోత్సవం పేరుమీద ఒక స్పెషల్ కవర్ చేశామన్నారు. పోస్టల్ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ప్రసాదాలు భక్తులు చేరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది అన్నారు.

 

డాక్టర్ అంబేద్కర్ పోస్టల్ స్టాంపును విడుదల

ప్రపంచ మేధావి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు పర్యటన విశేషాలతో కూడిన వివరాలను తపాలా శాఖ సేకరించి ఆయా ప్రాంతాల్లో డాక్టర్ అంబేద్కర్ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. బుధవారం రాజమండ్రి నగరంలో డాక్టర్ అంబేద్కర్ పోస్టల్ స్టాంపును రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ 1944 సెప్టెంబరు 28న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చారని ఆయన తెలిపారు. అప్పటి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఎం టి రాజు ఆయనను రైల్వేస్టేషన్ కు వెళ్లి స్వాగతం పలికి కారులో పురపాలక సంఘ కార్యాలయానికి తీసుకు వచ్చారన్నారు. మున్సిపల్ చైర్మన్ సోమిన కామేశ్వరరావు కమిషనర్ కె వెంకటాద్రి చౌదరి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి మ్యూజియం హాలులో పౌర సన్మానం చేశారన్నారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ డ్రాఫ్ట్ నిర్మాణానికి ఆలోచిస్తుందని వీటికి సంబంధించిన ప్రతినిధులతో వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం జరిపి రాజ్యాంగాన్ని రూపొందిస్తామని ఆయన ఈ సభలో పేర్కొనడం భారత జాతికి ఎంతో గర్వకారణమని ఈ విధంగా రాజమండ్రి డాక్టర్ అంబేద్కర్ పర్యటనతో పునీతమైందని ఎంపీ మార్గాన్ని భరత్ ప్రశంసించారు. ఈ స్టాంపులు చేపట్టిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు ను ఆయన అభినందించారు.

డాక్ట‌ర్ బి ఆర్ అంబేడ్క‌ర్ ప్ర‌త్యేక స్టాంపును విడుద‌ల చేస్తున్న రాజ‌మండ్రి ఎంపి మార్గాన్ని భరత్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లుచీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కు ఘన సన్మానం..

కారుణ్య నియామకాల విషయంలో 2005 నుండి 2020 వరకు అపరిష్కృతంగా ఉన్న కారుణ్య నియామకాల సమస్యలను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు తాను పదవి బాధ్యతలు చేపట్టిన మరుక్షణంలోనే పరిష్కరించారు. దీనివల్ల రాష్ట్రంలో రెండు వందలకు పైగా కుటుంబాలకు న్యాయం చేకూరి నట్టైంది. వీటిని పురస్కరించుకుని గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం రాజమండ్రి రామచంద్రపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు పి శ్రీనివాస్, కార్యదర్శి పి భూలోకం, కోశాధికారి బి రాంబాబు, రామచంద్రపురం బ్రాంచ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు వైస్ స్పర్జన్ రాజు, కార్యదర్శి ఎస్. వి.వి మునేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గండ్రోతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.