ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి: సిర్పూర్(టీ) ఎస్ఐ రవి కుమార్

సిర్పూర్(టీ): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) ఎస్ఐ రవి కుమార్ స్థానిక చౌరస్తాలో సోమవారం మాస్కులు ధరించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిర్పూర్(టి) మండల ప్రయాణ ప్రాంగణం చౌరస్తా లో ఎస్సై రవి కుమార్ బయటికి వచ్చేవారు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రజలకు తెలిపారు. లేకపోతే చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకొని కోర్టు లో హాజరు పర్చడం జరుగుతుందనీ తేలియ చేశారు. మాస్క్ ధరించకుండా బయట తిరుగుతున్న వారికీ జరిమానా విధించారు. ప్రజలంతా మాస్కులు ధరించి కరోనా కట్టడికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ సర్కార్ ఆదివారం కీలక నిర్ణయం తీసున్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రజా రవాణా, కార్యాలయాల్లో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.