ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధాని మోదీతో సిఎం చర్చిస్తున్నట్లు సాచారం.
హస్తిన పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్నటి నుంచి పలువురి కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులపై చర్చించారు. శుక్రవారం హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ అయి.. వరద సాయం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కూడా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే ఈరోజు కేంద్ర మంత్రి హార్ధిప్‌సింగ్ పూరీతో సీఎం కేసీఆర్ సమావేశమై.. ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు హార్ధిప్‌సింగ్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.