ప్రపంచంలోనే పొడుగు కాళ్ల సుందరి..

ఈ మధ్య సోషల్ మీడియాలో We Have Legs అనే క్యాంపెయిన్ నడించింది. సెలబ్రిటీలు తమ అందమైన కాళ్లను చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ పోస్టుల‌న్నీంటిలో అమెరికాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి తన కాళ్ల ఫొటోలు పెడితే సోషల్ మీడియా జనం పిచ్చెక్కిపోయారు. ఆ అమ్మాయి పేరు మ్యాకీ కరిన్. టెక్సాస్‌లో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాళ్లు ఉన్న మహిళగా ఆమె గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది.
అంతకు ముందు రష్యాకు చెందిన యువతి పేరిట ఈ ‘పొడుగుకాళ్ల సుందరి’ రికార్డు ఉండేది. ఆమె పేరు అనాస్తాసియా రెషెతోవా(22) అత్యంత పొడవైన కాళ్లు కలిగిన సుందరిగా నిలిచింది. ఈమెను చిన్నప్పుడు స్కూల్లో గుర్రమని, జిరాఫీ అని పిలిచేవారట. కానీ ఇప్పుడా రికార్డును బ్రేక్ చేసింది మ్యాకీ కరిన్.

Leave A Reply

Your email address will not be published.