ప్రియాంకకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ఇటీవల న్యూజీలాండ్‌లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డెర్న్ కు కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని సోమవారం తన కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఆ దేశ కేబినెట్లో ప్రియాంక రాధాకృష్ణన్ చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక రాధాకృష్ణన్‌కు తెలంగాణ పురపాలక మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. న్యూజిలాండ్‌లో మంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయురాలు ప్రియాంక కావడం గర్వించదగ్గ విషయమన్నారు. కాగా ప్రియాంక రాధాకృష్ణన్ స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరవూర్.
Many congratulations to our friend @priyancanzlp on being appointed as Minister in the New Zealand Govt👍
Priyanca Radhakrishnan is the first Indian to be elevated to this position in NZ; My compliments to Prime Minister @jacindaardern on her fabulous leadership & poll victory👏 pic.twitter.com/3Xmqt97zui
— KTR (@KTRTRS) November 2, 2020