ప్రగతి భవన్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన నాగార్జున సాగర్ బహిరంగసభలో పాల్గొన్న తర్వాత సిఎం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోనా ఏప్రిల్ 19న సిఎం కెసిఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు గజ్వేల్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 20 రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.
చికిత్స అనంతరం ఈ నెల 4వ తేదీన సిఎం కెసిఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో సిఎం ఇవాళ ఎర్రవల్లి నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.