ప్రతి ఎకరాకు సాగునీరిస్తాం
దుబ్బాకలో మంత్రి హరీష్‌రావు
మిరుదొడ్డి: ప్రతి ఇంటికీ తాగునీరు అందించాం.! దుబ్బాక నియోజకవర్గంలో అతి త్వరలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడమే మా నినాదం.! దుబ్బాక నియోజకవర్గంలో ప్రతీ గడప గడపకు వెళ్లి తట్టాల్సిందే. దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన మిరుదొడ్డి మండల టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి, యువత అనుబంధ సంఘాల సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మిరుదొడ్డి మండల ఇంచార్జి సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మండలానికి చెందిన ఏంపీపీ, జెడ్పీటీసీ, మండల స్థాయి, గ్రామ స్థాయి టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య టీఆర్ఎస్ నాయకులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టెకి క్యాండిటేట్ లేడు. బీజేపీకి కార్యకర్తలు లేరు. దుబ్బాకలో ఏవరు గెలుస్తారని.. యువకుల నుంచి పండు ముసలిని అడిగినా కేసీఆర్ సారూ టీఆర్ఎస్ కారు గెలుపే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ ఎవరూ రెండవ స్థానంలో నిలిచేదనే పోటీ కాంగ్రెస్, బీజేపీలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు వస్తాయా.. అనేది తెలుసుకోవడం కోసమే.. ఈ దుబ్బాక ఉప ఎన్నికలు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు దుబ్బాక ప్రజలు ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారని., మిషన్ భగీరథతో మంచినీళ్ల బాధలు టీఆర్ఎస్ ప్రభుత్వంతో తొలగిపోయాయనే సంతోషంలో ఉన్నారు. స్వాతంత్ర్యo వచ్చిన నాటి నుంచి 70 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు నీళ్లు తాగించలేదని, కేవలం 6 ఏండ్లలో తాగునీరు, అతి త్వరలో సాగునీరు అందించనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అధిక సాగునీరు దుబ్బాక నియోజకవర్గంలో వస్తుందని, లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని, పంట కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వుకుంటే.. రెండు పంటలు వేసుకోవచ్చు. దేశంలోని 28 రాష్ట్రాల్లో బావి, బోరు బావులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన దమ్ము ఉన్న నాయకుడు కేసీఆర్. బోరు బావులకు విద్యుత్ మీటర్ల బిగింపు వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయాలి. అర్హత కలిగిన వారందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే. దేశంలోని 18 రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నదని.. ఏ రాష్ట్రంలోనైనా.. బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తుందా.. అంటూ సూటిగా ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో 56 వేల 906 పింఛన్లు ఉన్నాయని, ఇటీవల 5877 కొత్త పింఛన్లు మంజూరైనట్లు.., దుబ్బాకలో చదివిన కేసీఆర్ సారూకు.. బీడీ కార్మికుల బాధలు తెలుసునని.. దుబ్బాక పై ప్రేమ, మమకారంతో.. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి 35 కోట్లు అభివృద్ధి చేపడుతున్నాం. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల కోసం వచ్చేటోళ్లకు.. తేడా ఉంటుందని.. ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరిగేలా.. చూసే టీఆర్ఎస్ పార్టీకి లక్ష మెజారిటీ ఇవ్వండని.., కేసీఆర్ కు దండం పెట్టి దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను.“ అని హరీష్‌రావు అన్నారు.
ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి చేసేందుకు మంత్రి హరీశ్ రావుకు పూర్తి అవగాహన కలిగి ఉందని, బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఏలా జరుగుతుందని ఏంపీ పేర్కొన్నారు. ఇంక ఎంపి మాట్లాడుతూ.. “మల్లన్న సాగర్ జలాశయ కాలువ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తూంటే.. కోర్టు కేసులు పెట్టి అభివృద్ధికి నిరోధకులుగా మారుతూ.. కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయి. బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి ఏలా జరుగుతుందని.. రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. మాటలు చెప్పడం తప్ప బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఏమీ కాదని ఏంపీ తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రం పై కుట్రలు పన్నుతున్నారని, మద్దత్తు ధర ఇవ్వొద్దని బీజేపీ చెప్పడం విడ్డురంగా ఉంది.“ అని అన్నారు.
ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ… “టీఆర్ఎస్ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. హరీశ్ రావు నేతృత్వంలో ఎక్కడికి వెళ్లినా భారీ విజయం ఖాయమని, దుబ్బాక నియోజకవర్గ ఎన్నికల్లో విజయం మనదేనని స్పష్టం చేశారు. బీజేపీలో వానా కాలం కప్పలు మాదిరిగా ఎన్నికలు రాగానే వచ్చిపోతారు.“ అని అన్నారు.