ప్రశాంత్‌నగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్

ప్రశాంత్‌నగర్ (హైదరాబాద్): శేరిలింగంపల్లి డివిడజన్‌లో 12 కోట్ల రూపాయలతో రోడ్డు, నాలాలు తదితర అభివృద్ధి పనులును చేయనున్నట్లు ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ తెలిపారు. స్థానిక ప్రశాంత్‌నగర్‌లో రూ.1.23 కోట్లతో సిసి రోడ్డు పనులను బుధవారం సాయంత్రం శంకుస్థాన గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఈ డివిజన్‌లో ఒక నెల లోపు అభివృద్ధి పనులు అన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులలో భాగంగా ప్రశాంత్‌నగర్‌లో రోడ్డు పనులు ప్రారంభించామని గాంధీ తెలిపారు. లాక్‌డౌన్, కరోనా, వర్షాల మూలాంగా ఇక్కడ డివిజన్‌లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు అన్నీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, కాలనీ ప్రెసిడెంట్ యాదయ్య ముదిరాజ్, కాలనీ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్ దాసోజు తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రశాంత్‌నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ తదితర ఇబ్బందులను ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సానుకుంలంగా స్పందించారని స్థానిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.