పసిడి ప్రియులకు శుభవార్త

హైదరాబాద్ (CLiC2NEWS): పసిడి ప్రియులకు శుభవార్త. కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తుండడంతో.. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వచ్చాయి. ఒకనొక దశలో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరుగుదలను నమోదుచేసుకున్నాయి. ఇక నిన్నటితో పోల్చుకుంటే.. శనివారం ఉదయం బంగారం ధరలు కాస్త తగ్గుముఖంగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో పెరిగిన బంగారం ధర ఇవాళ భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 47,780 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 తగ్గి రూ. 43,800 కు చేరింది. అలాగే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.700 పెరిగి రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.