ప‌సిడి ప‌రుగుకు బ్రేక్‌

హైద‌రాబాద్: ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త. బంగారం, వెండి ధ‌ర‌లు గత 9 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో బంగారం పెట్టుబడులు పెట్టేందుకు ముదుపరులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గ‌త వారం రోజుల‌కు పైగా పెరుగుతూ వ‌చ్చిన బంగ‌రం ధ‌ర‌లకు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 43,300కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,350కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ.71,600కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.