ప.గో.లో రెచ్చిపోయిన `పందెం` కోళ్లు!

ముండూరు (పశ్చిమ గోదావరి): సంక్రాంతి అంటేనే కోడిపందేలు.. ముఖ్యంగా ఉభయ గోదారి జిల్లాల్లో కోడిపందేలకు పెట్టింది పేరు. గోదావరి జిల్లాల్లో బోగి సందర్భంగా మొదలైన కోడి పందేల జోరు గురు, శుక్రవారల్లో తారాస్థాయికి చేరుకుంది. కోడి పందేలతో పాటు కోతాట, పేకాట, గుండాట లోన బయట వంటి తదితర జూద క్రీడలు యథేచ్ఛగా నిర్వహించారు. పగలే కాంకుండా విద్యుద్దీప వెలుగుల్లో కూడా రాత్రి వేళ ఈ జూద క్రీడలు నిర్వహకు.. భారీ ఏర్పాట్లతో నిర్వహించారు. పండుగ మూడు రోజులూ ఈ జూద ఆటల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి.
పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అయి భీమవరం, మొగల్తూరు, దెందులూరు, పెదవేగి, కుక్కనూరు, కామవరపుకోట, భీమవరం, కాళ్ల ఉండి, పాలకోడేరు, ఆకివీడు, నిడమర్రు, మందలపర్రు, లింపాలెం, కొవ్వూరు, చింతలపూడి, జంగారెడ్డి గూడెం, పాలకొల్లు, పోడూరు తదితర మండలాల్లో పందేల జోరు కొనసాగింది.

దెందులూరు మండలంలోని శ్రీరామవరంలో నిర్వహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కోడి పందేలతో పాటు గుండాట యథేచ్ఛగా నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారితో పలువురు బయటవాళ్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల పందేలన పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ నారాయణ్ నాయక్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
దెందులూరు మండలంలోని శ్రీరామ వరంలో గుండాట..

