ఫైజర్‌ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు

వాషింగ్టన్‌: యూఎస్‌ ఫార్మా దిగ్గజం కరోనా వైరస్‌ కట్టడి కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపునిచ్చింది. జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో సహకారంతో ఫైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ను అత్యవసర ప్రాతిపదికన వినియోగించవచ్చునంటూ డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వెరసి ప్రపంచంలోనే కోవిడ్‌-19 కట్టడికి డబ్ల్యూహెచ్‌వో గుర్తింపును పొందిన తొలి వ్యాక్సిన్‌ను రూపొందించిన దిగ్గజంగా ఫైజర్‌ నిలిచింది.ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను యూకే, యూఎస్‌, కెనడా, బెహ్రయిన్‌ తదితర దేశాలలో ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌కు తోడు యూఎస్‌లో హెల్త్‌కేర్‌ దిగ్గజం మోడర్నా ఇంక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌కు సైతం యూఎస్‌ఎఫ్‌డీఏ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కాగా.. మరోపక్క యూకే ప్రభుత్వం సైతం ఫైజర్‌ వ్యాక్సిన్‌కు జతగా బ్రిటిష్‌, స్వీడిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌ను అనుమతించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీతో కలసి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.