ఫ్రెండ్లీ పోలీసింగ్ అమోఘం: రామగుండం సీపీ సత్యనారాయణ
మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్ అమోఘం అని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. గురువారం గుడిపేటలోని 13వ ప్రత్యేక బెటాలియన్లో శిక్షణ పొందిన అభ్యర్థుల అవుట్ పాసింగ్ పరేడ్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్ అమోఘమన్నారు. పోలీసులు ఉన్నది సమాజ సేవకేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీసులు లేకుంటే దేశమే అల్లకల్లోలంగా మారుతుందన్నారు. గుడిపేట బెటాలియన్లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని.. అపుడే పోలీసులు అంటే ప్రజల్లో మరింత గౌరవభావం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాడెంట్ ఎంఐ సురేష్, అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.