బహర్ అలీ: పరివృత్త త్రికోణాసనం

చేయువిధానం:
1. రెండు పాదాలు దగ్గరగా పెట్టి ఆసన స్థితిలో నిటారుగా నిలబడవలెను.
2. త్రికోణాసనం వలే పాదాలను మీటరు దూరంలో ఉంచి, చేతులు భూమికి సామాంతరంగ నుండునట్లు పైకెత్తుము.
3. నిదానంగా శ్వాసను రెండు ముక్కుల ద్వారా పీల్చుకొవాలి. తరువాత నెమ్మదిగా శ్వాసను విడుస్తూ నడుమును వంచి, మోకాళ్ళను వంచకుండ, కుడి చేతిని ఎడమ పాదముపైకి తెమ్ము. ఒక నిముషం అలానే ఉండాలి. తలను సాధ్యమైనంత వరకు పైకి ఆకాశం వైపు చూడటానికి ప్రయత్నం చేయాలి.
4. తిరిగి పైకి లేచేటపుడు శ్వాసను తీసుకుంటూ లేవాలి.
5. తిరిగి మరల ఎడమ వైపు అలానే చేయాలి.
లాభాలు:
1. వెన్నుముక, రెండు ప్రక్కలకు బాగుగా వంగుటకిది సహకరించును.
2. వెన్నుముకలో దోషములు సరిచేయును.
3. మూత్రపిండాలు చైతన్యవంతమగును.
5. ఊపిరితిత్తులు బలహీనత తొలుగును.
6. మహిళలు కూడా ఉపయోగకరమైన ఆసనం.
7. నడుము చుట్టు ఉన్న కొవ్వును కరిగించి నడుమును సుందరంగా చేయును.
-షేక్.బహర్ అలీ.
యోగాచార్యుడు
తప్పక చదవండి: స్త్రీ, పురుషులకు ఉపయోగకరమైన త్రికోణాసనం
(షేక్.బహర్ అలీ: శిశిర ఋతువులో చక్కటి ఆరోగ్యానికి..)