శివ‌కాశిలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

శివకాశి: బాణాసంచా తయారు చేస్తుండగా జ‌రిగిన ప్ర‌మాదంలో ఆరుగురు చనిపోయారు. శివకాశి శివారులోని కలయార్కురిచి బాణాసంచా కర్మాగారంలో గురువారం ఒక్కసారి పెద్ద పేలుడు జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగు చ‌నిపోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని శివకాశిలోని ఓ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసారు.
పేలుడు ధాటికి పటాకులు తయారు చేస్తున్న కంపెనీ గోడలు బద్దలయ్యాయి.  ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.