బార్ కౌన్సిల్ (ఎఐబిఇ) పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్ష (ఎఐబిఇ) వాయిదా పడిందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అధికార ప్రకటనలో వెల్లడించిది. ఆలిండియా బార్ పరీక్షకు కొత్త షెడ్యూల్ ప్రకటించడంతోపాటు పరీక్షకు దరఖాస్తు దాఖలు తేదీని కూడా పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ పరీక్ష వచ్చే మార్చి 21 న జరుగాల్సి ఉన్నది. కాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షను ఏప్రిల్ 25 న ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌ను నిర్వహించనున్నదని పేర్కొన్నది. మార్చి 21 న జరుపతలపెట్టిన పరీక్షను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. దీనితో పాటు బీసీఐ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును మార్చి 22 వరకు పొడిగించారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అధికార ప్రకటనలో వెల్లడించిది.
