బిజెపి.. దేశాన్ని అమ్మేస్తోంది: కెటిఆర్‌

హైదరాబాద్‌ : భార‌తీయ జ‌న‌తాపార్టీ భార‌త‌దేశాన్ని అమ్మేస్తోందని మంత్రి కెటిఆర్ విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం తెలంగాణ‌భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భార‌త‌దేశంలో ముస్లింల‌పై బిజెపికి ఎంత విధ్వేషం ఉందో అంద‌రికీ అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మత తత్వాన్ని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా ప్రశంసించి.. ఎన్నికల వేళ ఛార్జీషీట్‌ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్‌ అన‌డం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఛార్జీషీటు ఎందుకు..
ఇటీవ‌ల టిఆర్ ఎస్‌పై చార్జిషీటు విడుద‌ల చేసిన బిజెకి కెటిఆర్ 50 ప్ర‌శ్న‌లు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటిన్నర ఎకరాలకు నీరందించాం. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతు భీమా పథకంతో రైతుల్లో భరోసా నింపాం. వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నాం. యేటా రూ. 50 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. కేసీఆర్‌ కిట్టుతో మతా శిశు మరణాలు తగ్గించాం. పవన్‌ హాలిడేస్‌ను ఎత్తివేశాం. పరిశ్రమలకు బాగు చేశాం. రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. లక్షలాది మంది యువతకు ఉపాధి, విద్యా అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందుకు ఛార్జీషీటు వేస్తారా అంటూ బీజేపీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

 

Leave A Reply

Your email address will not be published.