బిజెపి నేత లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్
హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా సెకండ్ వేవ్ సామాన్యులనే కాకుండా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో పాటు సినీ తారలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఇవాళ భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు.
ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ పరీక్ష చేయించుకొని ఐసోలేషన్‌లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.