బిజెపి నేత స‌స్పెన్ష‌న్‌

బిజెపి నేత స‌స్పెన్ష‌న్‌

గుంటూరుః మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయిన బిజెపి నేత రామాంజనేయులును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారికి బిజెపిలో స్థానంలేద‌ని, అటువంటి వారిని బిజెపి ఎన్న‌టికి స‌హించ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నేతలు అక్రమ కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని, రామాంజనేయులు వ్యవహరంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో తదుపరి చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.బిజెపి మాజీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు రామాంజనేయులు సన్నిహితుడుగా ప్రచారం జరుగుతోంది.
కాగా నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు సహా మరో ముగ్గురుని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయలు గత ఎన్నికల్లో కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ హాయంలో వైన్స్‌, బార్లు కూడా ఆయన నిర్వహించారు. తాజాగా అక్రమంగా మద్యం రవాణ చేస్తున్న ఆయనను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.