బీజేపీపై యుద్ధం అంటే ఇదేనా?: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనేక విమర్శలు చేశారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ బీజేపీ నేతలకు వొంగి వొంగి ఎందుకు నమస్కారం పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీపై యుద్ధం చేయడం అంటే ఇదేనా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు పంట నష్టంపై సర్వే చేయలేదని, రైతులను కేసీఆర్ నిండా ముంచుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సన్నరకం రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల ఆర్థికసాయం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు అని అన్నారు.