బీజేపీవి అన్నీ దోకాబాజీ మాటలేః హ‌రీష్‌రావు

సిద్దిపేట: భార‌తీయ జ‌న‌తాపార్టీవి అన్నీ దోకాబాజీ మాటాలే అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం దుబ్బాక రెడ్డి ఫంక్షన్‌ హాలులో పలువురు బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు రూ.1600 ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, 16 పైసలు కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలని మంత్రి డిమాండ్‌ చేశారు. గుజరాత్‌ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గోబెల్స్‌ ప్రచారాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మంత్రి విమర్శించారు. త్వరలో జరుగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.