బీజేపీ కార్యాలయంలో సంబురాలు షురూ.

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా ఫుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్‌‌ఎస్‌ 56, బీజేపీ 48 చోట్ల విజయం సాదించింది, ఎంఐఎం 44 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ రెండు స్థానాలకే పరిమితమైంది. గ్రేటర్‌లో 48 సీట్లతో సత్తా చాటిన బీజేపీ. 2023లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం 48 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు షురూ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంతత్రి కిషన్‌ రెడ్డితో పాటు డీకే అరుణ, లక్ష్మ‌ణ్‌లు కలిసి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఒ‍కరినొకరు స్వీట్లు పంచుకొన్న బీజేపీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.