బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సలహా మేరుకు హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. కొన్నిరోజులు ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు చక్కబెట్టనున్నట్లు నడ్డా ప్రకటించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేయించుకొని క్వారంటైన్‌లో ఉండాలని అభ్యర్థించారు.

 

Leave A Reply

Your email address will not be published.