బూడిదైన కుమార్తె పెళ్లి కోసం ఉంచిన 9 లక్షలు

శ్రీకాకుళం: చిత్తూరు జిల్లా కొత్తూరు మండ‌లంలో సోమ‌వారం షార్ట్‌సర్క్యూట్‌తో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక హంస కాలనీలో జ‌రిగిన ప్ర‌మాదంలో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్‌కు చెందిన ఇళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలు కాలిబూడిదైనట్లు అగ్నిమాపక అధికారి ఐవీ రామయ్య తెలిపారు. కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారంతోపాటు టీవీ, విలువైన వస్తువులు కాలిపోవడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

Leave A Reply

Your email address will not be published.