బెంగాల్‌లో పడవ మునిగి ఐదుగురు మృతి

ముర్షీదాబాద్‌: పశ్చిమ బెంగాల్‌లో దసరా ముగింపు వేడుకల్లో ఒక ప‌డ‌వ మునిగి ఐదుగురు చ‌నిపోయారు. ఈ ఘటన ముర్షీదాబాద్‌లోని డుమ్నీ చెరువులో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాన్నినిమజ్జనం చేసేందుకు రెండు పడవల్లో తీసుకెళ్లారు. అందులో ఓ పడవ మునిగిపోవడంతో ప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాద సమయంలో ఒక్కొక్క పడవలో 10 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా బెల్డంగా ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. ఇంకా ఎవరైనా మునిగి పోయి ఉండవచ్చునన్న అనుమానంతో గజ ఈతగాళ్ల సాయంతో చెరువును గాలిస్తున్నామని చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే విపత్తు నిర్వహణ బృందం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.