`ఔటర్`పై బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం లారీ బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అతివేగంగా వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్‌తో సహా క్లీనర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.