బ‌చ్చ‌న్న‌పేట‌లో వాహనం బోల్తా ప‌డి ఇద్దరు మృతి

బ‌చ్చ‌న్న‌పేట‌: జనగామ జిల్లాలో టాటా ఎస్ వాహనం బోల్తా పడిన ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. టాటా ఎస్ వాహనం బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులు సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన బుడిగె మల్లయ్య, జనగామకు చెందిన చెన్నమ్మగా గుర్తించారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.