భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ సోదరుడు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో శ‌నివారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సోద‌రుడు ప్రహ్లాద్ మోడీ పర్యటించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రహ్లాద్ మోడీ మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య జరిగి ఘర్షణల్లో అమరుడైన వీరజవాను కల్నల్ సంతోష్ జన్మదినం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశానని చెప్పుకొచ్చారు. కల్నల్ సంతోష్ ఆత్మకు శాంతి కలగాలని భాగ్య‌ల‌క్ష్మి అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురు బిజెపి నాయ‌కులు, అభిమానులు పాల్గొన్నారు.
కాగా, గతేడాది భారత్-చైనా సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ అమ‌రుడైన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.