భారత్‌లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,99,09,90 నమూనాలను పరిశీలించగా 62,212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,681కి చేరింది. నిన్న ఒక్క రోజే 837 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,12,998 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 65,24,596 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,95,087గా ఉంది. కరోనా రోగుల రికవరీ రేటు 87.78 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 9,99,090 కరోనా టెస్టులు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9,32,54 017 నమూనాలను నిర్వహించారు.