భారత్‌ బయోటెక్‌ మరో శుభ‌వార్త‌

న్యూఢిల్లీ : క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌పంచాన్ని తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల్లో కరోనా ఉగ్ర‌రూపాన్ని త‌ల‌చుకుంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ను భ‌యం వెంటాడుతోంది. ఇప్ప‌టికే కొన్ని దేశాలు ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ సైతం హెచ్చరికలు జారీచేసింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. శాస్త్రవేత్తలు అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇక భారత్‌లోనూ వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ వరుసలో దేశీయ కంపెనీ భారత్‌ బయోటెక్‌ ముందంజలో ఉంది.

తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ ఇది వరకే ప్రకటించింది. తాజాగా మరో కీలక విషయాన్ని వెల్లడించింది. తాము రూపొందిస్తున్న కోవాక్సిన్‌ 60 శాతం ప్రభావం చూపింస్తుందని, వచ్చే ఏడాది ద్వితియార్థంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. వైరస్‌పై పోరులో తమ వ్యాక్సిన్‌ మంచి ఫలితాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ సంస్థ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ ప్రసాద్‌ ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాల్లో 26,000 మంది వాలంటీర్లతో ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదేనని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.