భారత వైమానిక దళం మరింత బలోపేతం
ఎయిర్ ఫోర్స్ డే వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా
ఘజియాబాద్: ఘజియాబాద్‌లోని హిందన్ ఎయిర్‌బేస్‌లో ఎయిర్ ఫోర్స్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ.. భారత వైమానిక దళంలో 89వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యిందన్నారు. ఐఏఎఫ్ క్రమంగా రూపాంతరం చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు మనం ఓ కొత్త శకంలోకి ప్రవేశించామన్నారు. మన వైమానిక శక్తిని, మల్టీ ఆపరేషన్లు నిర్వహించే కాలంలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా అసాధారణ రీతిలో గడుస్తున్నదని, కోవిడ్ ప్రపంచం అంతా వ్యాపిస్తుంటే, మన దేశం స్థిరంగా స్పందించిందని, ఇలాంటి సమయంలో వైమానిక దళల యోధులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఆయన చెప్పారు.

భారత వైమానిక దళం మరింత బలోపేతం అవుతుందని, దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. ఇటీవల ఉత్తర సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ సమయంలో వైమానిక దళాలు స్పందించిన తీరు అద్భుతమని, వారిని అభినందించినట్లు కూడా ఆయన గుర్తు చేశారు.