భారీగా అంబర్ ప్యాకెట్లు పట్టివేత

ఖమ్మం : అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అంబర్ ప్యాకెట్ల‌ను పోలీసులు భారీగా ప‌ట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని బికె.బజార్ చెందిన దనారపు వాసుదేవరావు తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత పొగాకు, అంబార్ ప్యాకెట్లను ఖ‌మ్మం పోలీసులు ప‌ట్టుకున్నారు. ఎస్సై సతీష్ , ప్రసాద్, వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్ తమ సిబ్బందితో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన త‌నిఖీల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 17 సంచులను నిల్వ ఉన్న వీటి విలువ మార్కెట్ లో రూ.8,21,780 వుంటుందని అంచ‌నా. వీటిని చిల్లర దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు నిందుతుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.