భారీగా హెరాయిన్ పట్టివేత

శ్రీనగర్ (CLiC2NEWS): ఇండియా-పాక్ సరిహద్దుల్లో భారీగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని భద్రతా దళాలు కాల్చివేశాయి. తరలిస్తున్న వ్యక్తి నుంచి 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఉన్న హీరానగర్ సెక్టార్‌లో బుధవారం తెల్లవారుజామున అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్న వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం గుర్తించింది. ముందుగా అతడిని లొంగిపోవాలని తెలిపినా అతను పారిపోయేందుకు యత్నించడంతో కాల్చివేశారు. అనంతరం అతని వద్ద 27 కిలోల హెరాయిన్ విలువ రూ.135 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు.