భారీ నష్టాల్లో మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. గత మూడు రోజులుగా లాభాల్లో కొనసాగిన సూచీలు.. మదుపరుల అమ్మకాల ఒత్తిడితో నష్టపోక తప్పలేదు. స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాలతో ముగిశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాక్‌లు నష్టాలను నమోదు చేయడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్ 400 పాయింట్ల మేర నష్టపోయింది. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 394.40 పాయింట్లు (1.02శాతం) నష్టపోయి 38,220.39 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 96.20 పాయింట్లు (0.84 శాతం) క్షీణించి 11,312.20 వద్ద క్లోజ్ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ తదితర షేర్లు నష్టాలను నమోదు చేసిన వాటిలో ఉన్నాయి. ఇక ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడం, కరోనా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆ దేశ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా సూచీ లూ పడిపోగా, ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ఒక్కరోజే 20 పైసలు క్షీణించింది. కరోనా వైరస్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌సహా ఆసియా దేశాల కరెన్సీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలోనే 75.02కు రూపాయి విలువ పరిమితమైంది.

Leave A Reply

Your email address will not be published.