భారత్ కొత్తగా 9,309 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే గత 24 గంటల్లో మరో 87 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందారు. కాగా ఇప్పటి మొత్తం కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 1,55,447కు పెరిగింది. దేశంలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,08,80,603కు పెరిగాయి. తాజాగా మరో 15,858 మంది డిశ్చార్జి కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,05,89,230కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,35,926 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.